- Advertisement -

టీడీపీకి షాక్..వైసీపీలోకి కీలకనేతలు!

- Advertisement -

జోష్ మీదున్న టీడీపీ నేతలకు గట్టి షాక్ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు మురహరిరెడ్డి, కిరణ్ కుమార్, మధు, మల్లికార్జున వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్.

వీరంతా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో సీనియర్ నేతలు. కె.ఆర్‌.మురహరి రెడ్డి (ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్‌), కిరణ్‌ కుమార్‌ (బీజేపీ ఎమ్మిగనూరు టౌన్‌ ప్రెసిడెంట్‌), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్‌ – ఎమ్మిగనూరు), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్‌ సెక్రటరీ)లలుగా పనిచేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్‌ వి మోహన్‌ రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ వైయ‌స్ఆర్‌సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఎర్ర‌కోట జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -