- Advertisement -
సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి. ఈ పిటిషన్ను విచారణ చేపట్టారు జస్టిస్ కె.లక్ష్మణ్. ఓఎంసీ కేసులో భాగంగా గాలి, అతని కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు 58 కిలోల బంగారం, వజ్రా భరణాలను స్వాధీనం చేసుకుంది సీబీఐ.
సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేయాలని సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు గాలి జనార్థన్ రెడ్డి.
కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు సీబీఐ తరఫు న్యాయవాది.
తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.
