- Advertisement -

పంచాయతీ కార్యదర్శులకు షాకిచ్చిన బాబు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల జీతాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు అమలులో ఉన్న పేస్కేల్ రూ.28,280 నుంచి రూ.25,220కు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 60ను విడుదల చేసింది. గతంలో జీవో 91 ప్రకారం పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3కు అప్‌గ్రేడ్ చేసి, రూ.28,280 పేస్కేల్ అమలు చేశారు. అయితే తాజాగా ఆ జీవోను సవరించి కొత్తగా జీవో 60 తీసుకువచ్చి జీతాన్ని తగ్గించడం ఉద్యోగుల్లో అసంతృప్తి రేకెత్తించింది.

ఈ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీతాన్ని తగ్గించడం అన్యాయమని, వెంటనే జీవో సవరణను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు.

పంచాయతీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న కార్యదర్శుల పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వివాదం మరింత ముదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -