- Advertisement -

పేద విద్యార్థి కోసం హరీష్ రావు ఇల్లు తాకట్టు!

- Advertisement -

సిద్దిపేటకు చెందిన వైద్య విద్యార్థిని మమత పీజీ చదువుకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు చూపిన మానవీయత ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. పీజీ ఎంట్రన్స్‌లో సీటు సాధించిన మమతకు, ట్యూషన్ ఫీజులే పెద్ద సవాల్‌గా మారాయి. ప్రతి సంవత్సరం రూ.7.50 లక్షల మేర ఫీజులు ఉండగా, మూడు సంవత్సరాలకు కలిపి రూ.20 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది.

మమత ఇప్పటికే తన స్వగృహాన్ని తనఖా పెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పీజీ విద్య కోసం మరోసారి రుణం కోరగా, బ్యాంకర్లు “ఏదైనా ఆస్తిని మార్టిగేజ్ చేస్తేనే లోన్ మంజూరు చేస్తాం” అంటూ నిరాకరించారు. ఈ పరిస్థితిలో మమత తీవ్ర నిరాశకు లోనైంది. ఈ విషయం తెలుసుకున్న హరీష్‌రావు వెంటనే స్పందించారు.

ఎటువంటి ఆలోచన లేకుండా, తన స్వగృహాన్ని బ్యాంకులో మార్టిగేజ్ చేసి, మమత పీజీ విద్య కోసం రూ.20 లక్షల రుణాన్ని మంజూరు చేయించి ఆమెకు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల తనకు ఉన్న బాధ్యతను, సామాజిక స్పృహను ఈ చర్యతో హరీష్‌రావు మరోసారి చాటుకున్నారు.

పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మమతకు ఈ సహాయం కొత్త ఆశను, ధైర్యాన్ని ఇచ్చింది. హరీష్‌రావు చేసిన ఈ ఉదార చర్య సమాజానికి ఒక గొప్ప సందేశంగా నిలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -