- Advertisement -

బాలయ్యకు షూటింగ్‌లే ముఖ్యమా?

- Advertisement -

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు షూటింగ్‌లు తప్ప ప్రజల సమస్యలు పట్టవని మండిపడ్డారు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ టీఎన్ దీపిక. ఏపీ వ్యాప్తంగా బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆమె..బాలకృష్ణ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది పోయి ఎక్కడో దేశ విదేశాల్లో షూటింగ్ లు చేసుకుంటూ చుట్టపు చూపుగా ప్రైవేట్ కార్యక్రమాలకు వస్తున్నారని విమ‌ర్శించారు.

ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు ఎవరు లేరని, ఎన్నికలలో (సూపర్-6) పథకాలు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, మహిళలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలను పూర్తిగా విస్మరించారని, వ్యవస్థను అడ్డుపెట్టుకొని నాయకులను, కార్యకర్తల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -