వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 11న 5 గంటలకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ అవ్వాలని ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి.
రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ కు ఈ నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు అనుమతి లభించింది. కాగా, ఇదే సమయంలో బెయిల్ వేళ రూ 50 వేల పూచీ కత్తు.. ఇద్దరు షూరిటీతో పాటుగా పలు షరతులను కోర్టు విధించింది. లి
క్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ-4గా ఉన్నారు. సిట్ విచారణ ఎదుర్కొన్న మిథున్ ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదిస్తూ,ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే అమృతపాల్ సింగ్ కేసులో పోస్టల్ బ్యాలట్ వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇదే విధానాన్ని మిథున్‌రెడ్డికి కూడా వర్తింపజేయాఅని పేర్కొన్నారు.
