- Advertisement -

టీడీపీ కంచుకోటలో ఈసారి వైసీపీనే!

- Advertisement -

విశాఖపట్నం నియోజకవర్గంలోని శృంగవరపు కోట. టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ అవిర్భావం నుండి రెండు సార్లు తప్ప అన్నిసార్లు విజయం టీడీపీదే. అలాంటి టీడీపీ కంచుకోటలో గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది.విశాఖపట్నం ఎంపీ పరిధిలోని ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బొత్స. ఎందుకంటే విశాఖ ఎంపీగా బొత్స సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు.

1983 నుంచి 2004 వరకు కోళ్ల ఫ్యామిలీకి తిరుగులేదు. అయితు గత ఎన్నికల్లో మంత్రి బొత్స స్పెషల్ ఫోకస్ చేయడంతో కోళ్ల లలితకుమారికి ఓటమి తప్పలేదు. కోళ్ల లలితా తాత అప్పలనాయుడు ఆరు సార్లు, లలిత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమెకు ఇంటిపోరు ఎక్కువైంది. కోళ్ల కుటుంబం ఆధిపత్యాన్ని తట్టుకోలేక గొంప కృష్ణ వైపు చేరడంతో టీడీపీలో రెండు గ్రూపులు తయారయ్యాయి.

ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ లలితకుమారికే టికెట్ ఇవ్వగా కృష్ణ ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే మరోసారి టికెట్‌ ఇచ్చింది. సోషల్‌ ఇంజినీరింగ్‌తో ఎస్‌.కోటలో విక్టరీ కొట్టిన వైసీపీ ఈసారి జగన్ సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని భావిస్తోంది. దీనికి తోడు విశాఖ ఎంపీగా మంత్రి సతీమణి ఝాన్సీలక్ష్మి పోటీ చేస్తుండటం కూడా కలిసివచ్చే అంశం. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అండగా వైసీపీ ప్రచారంలో దూకుడు పెంచింది. మరి టీడీపీ కంచుకోటలో ఆ పార్టీ జెండా ఎగరేస్తుందా లేదా అభివృద్ధే మంత్రంగా వస్తున్న వైసీపీని ప్రజలు ఆదరిస్తారా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -