ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
‘జగన్ 2.0 – మావిగన్ 2029’ పేరుతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. “వన్ పార్టీ, వన్ ఫ్లాగ్, వన్ అజెండా” అనే నినాదంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.
ఈ ఫ్లెక్సీలను వైసీపీకి చెందిన నేత శివాజీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జగన్ ఇంటి ముందు ఈ హోర్డింగులు ఏర్పాటు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న ఉద్దేశ్యంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘మావిగన్’ అనే కాన్సెప్ట్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నమా? లేక 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యూహాల భాగమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి, తాడేపల్లిలో ఏర్పాటైన ఈ ‘మావిగన్ 2029’ ఫ్లెక్సీలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
