తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 13వ తేదీన ఆయన అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ఏప్రిల్ 7న జగిత్యాలకు రానున్నారు. అమెరికా పర్యటన నుంచి ఏప్రిల్ 6న తిరిగి వచ్చిన వెంటనే, తెల్లవారుజామునే జీవన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జీవన్ రెడ్డి చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైందని, 13వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన చేరిక అనంతరం జగిత్యాల వేదికగానే బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించే అవకాశముంది. ఈ ప్లీనరీలో జీవన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డి తీసుకోబోయే తదుపరి రాజకీయ నిర్ణయంపై ఇప్పటికే చర్చలు వేడెక్కాయి. ఆయన బీఆర్ఎస్లో చేరితే, ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
