కూటమి ప్రభుత్వంలో యూరియా దొరుకుతోందా అని రైతుల దగ్గరికే వెళ్లి అడుగుదాం అని ఛాలెంజ్ చేస్తే..వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు ఏసీ రూములో కూర్చుని మీడియాతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
50% పైగా యూరియాను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చామని అచ్చెంనాయుడు స్వయంగా ఒప్పుకుని ఇప్పుడు 70% రైతులకు సప్లై చేశామని మాట మారుస్తున్నారు. మరోపక్క ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభించలేదు. రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు.
కూటమి ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు టీజేఆర్ సుధాకర్ బాబు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడే మా దళితులకు చంద్రబాబుకు మధ్య వైరం మొదలైంది… సంక్షేమంలో మా వాటా మాకు దక్కడం లేదు. వైయస్ జగన్ హయాంలో రూ.2,75,000 కోట్ల DBTలో రూ. 50,000 కోట్లు ఎస్సీ, ఎస్టీలకు వచ్చాయి. ఇందులో ఒక సంవత్సర భాగం రూ.10,000 కోట్లు చంద్రబాబు మాకు ఇవ్వలేదు. అన్ని పథకాల్లోనూ కోతలే అన్నారు.
