- Advertisement -

‘కలైమామణి’..సాయి పల్లవి!

- Advertisement -

హీరోయిన్‌ సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం దక్కింది. ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మందిని ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.

2021వ సంవత్సరానికి సాయిపల్లవి, ఎస్‌.జే సూర్య.. 2023కు సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఎంపికయ్యారు. తమిళనాడు ప్రభుత్వం సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది.

సాయి పల్లవితో పాటు అనిరుద్ రవిచంద్ర, దర్శకులు ఎస్.జే. సూర్య, లింగుస్వామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ వంటి ప్రముఖులు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -