- Advertisement -

బీసీ బంద్‌లో కవిత కొడుకు..గాసిప్స్ షురూ!

- Advertisement -

42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ సక్సెస్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు తెలపడంతో పాటు మంత్రులు కూడా బంద్‌లో పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఖైరతాబాదు చౌరస్తాలో జరిగిన మానవ హారంలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని… కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి పోరాడాలి అన్నారు ఆదిత్య.

కవిత కుమారుడు ధర్నాలో పాల్గొనడం అందరి దృష్టినీ ఆకర్షించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పనిసరి” అని రాసిన ప్లకార్డు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విదేశాల్లో చదువులు పూర్తి చేసుకుని ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన ఆదిత్య, ఈరోజు బంద్‌లో అనూహ్యంగా పాల్గొనడంతో వార్తల్లో నిలిచాడు. దీంతో ఆదిత్య పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -