Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ రెండు నియోజకవర్గాల్లో రూ.100 కోట్ల బెట్టింగ్!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ ఓ వైపు ప్రచారం హోరెత్తుతుండగా మరోవైపు బెట్టింగ్‌ రాయుళ్ల జోరు కొనసాగుతోంది. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ జోరుగా పందేలు కాస్తున్నారు.గెలిచే పార్టీనే కాదు అభ్యర్థి, మెజార్టీ పై జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాలే బెట్టింగ్ రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకటి ఖమ్మం కాగా మరొకటి పాలేరు. ఖమ్మంలో బీఆర్ఎస్ తరపున పువ్వాడ నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున తుమ్మల నాగేశ్వరావు బరిలో ఉండగా పాలేరులో బీఆర్ఎస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఈ రెండు స్థానాల్లో ఎవరు గెలుస్తారా..? మెజార్టీ ఎంత అనేదానిపై బెట్టింగ్ రాయుళ్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. మెజార్టీ వెయ్యి దగ్గరి నుండి 10 వేల వరకు రేటును బట్టి బెట్టింగ్ సాగుతుండగా ఈ రెండు స్థానాల్లోనే దాదాపు రూ. 100 కోట్లకు పైగా బెట్టింగ్ నడుస్తోందని సమాచారం.

2018 తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఏపీలో జోరుగా పందేలు కాశారు. ఇప్పుడు దానికి రెట్టింపు బెట్టింగ్ జరుగుతోంది. కొందరు అభ్యర్థుల ప్రతిపాదికన బెట్టింగ్ కాస్తుండగా మరికొందరు సిండికేట్‌గా మారి పందేలు కడుతున్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్ రూ.లక్షలు, కోట్లల్లో జరుగుతుండగా అవసరమైతే వ్యవసాయ భూములు, ఇళ్లను కూడా పందెంగా పెడుతున్నట్టు సమాచారం.ఇక గెలిచేది ఎవరైనా బెట్టింగ్ చేసి ఓడిపోతే వారి పరిస్థితి ఏంటా అన్నదానిపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఇక ఒకప్పుడు స్పోర్ట్స్‌కే పరిమితమైన బెట్టింగ్ ఇప్పుడు పాలిటిక్స్‌కు పాకడం సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతుందోనని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -