కేంద్రమంత్రి బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ స్క్రిప్ట్ ను బండి సంజయ్ చదువుతున్నారు అని ఎద్దేవా చేశారు. డ్రామారావు మాటలు పట్టించుకోకుండా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్రానికి ఏం చేయాలో ప్లాన్ చేయాలి అన్నారు.
అలాగే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు చామల. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు ఉంది కేటీఆర్ వ్యవహారం… బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారు అన్నారు.
మీ నాయన, నువ్వు దోచుకున్నట్లు ఎవరు సీఎం కూర్చీలో కూర్చున్నా దోచుకుంటారని కేటీఆర్ భావిస్తున్నారు… రాహుల్ గాంధీపై కేటీఆర్ చిల్లర విమర్శలు చేస్తున్నారు అని ఆరోపించారు.
కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారు… నీ లెక్క అందరూ వసూలు రాజాలు ఉండరు..అధికారానికి ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు మీ ఆస్తులు ఎన్నో ప్రజలకు తెలుసు..ఒక్క ఉపఎన్నిక రూ. 500 కోట్లు ఖర్చు పెట్టిన చెత్త చరిత్ర మీది అన్నారు.
మా రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం.. మీది రాజ భోగాల కుటుంబం..మా సీఎం మాట్లాడిన మాటలను వక్రీకరించి పిచ్చి ప్రచారం చేస్తున్నావ్ …అవసరమైతే రాహుల్ గాంధీ, పార్టీ కోసం వెయ్యి కోట్లు ఇచ్చే శక్తి తెలంగాణ కార్యకర్తలకు ఉందని మాత్రమే మా సీఎం అన్నారు అని గుర్తుచేశారు.
