తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య పొత్తు చిచ్చు రాజేసింది. పొత్తులో భాగంగా 9 స్ధానాలను జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించగా ఏ స్ధానాలనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది .ఇప్పటికే కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగా దీనిపై ఈ రెండు నియోజకవర్గాల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్‌లో ముసలం పుట్టింది.
పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ టికెట్ జనసేకు కేటాయిస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు హెచ్చరించారు. స్ధానిక బీజేపీ నేత దిలీపాచారి మొదటి నుండి టికెట్ ఆశీంచి పని చేసుకుంటు వస్తున్నారు. సడన్‌గా బీజేపీ నేతలు జనసేనతో పొత్తుకు వెంపర్లాడటంతో అసలు సమస్య మొదలైంది. మూడో లీస్ట్‌లోనూ నాగర్‌కర్నూల్‌కు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో రోడ్డెక్కారు దిలీపాచారి.
కచ్చితంగా టికెట్ తనకే వస్తుందని ఒకవేళ జనసేనకు కేటాయిస్తే ఊరుకేనే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయం ముందు దిలీపాచారి మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జనసేనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వొద్దు అంటూ నినాదాలు చేశారు. నాగర్ కర్నూల్ లో జనసేన అడ్రసే లేదని అలాంటి పార్టీకి ఎలా టికెట్ ఇస్తారని మండిపడ్డారు దిలీప్. జనసేనను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని నిలదీశారు. లేదని చెప్పారు. అలాంటి పార్టీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రి రాత్రికి జనసేన పార్టీని తీసుకొచ్చి మీరు భరించండి అంటే మేము భరించలేం అని తెలిపారు. మరి బీజేపీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. ఇప్పటికే చాలా చోట్ల బీజేపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశీంచిన రాకేష్ రెడ్డి…మొదటి నుండి పార్టీకి అంకితమై పనిచేస్తూ వస్తున్నారు. కానీ రాకేష్‌కు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది రాజీనామా చేశారు.
