- Advertisement -

రాజ్యసభలో నితీశ్‌..ప్రమాణస్వీకారం!

- Advertisement -

జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఏప్రిల్ 9న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం బిహార్‌లో ఏప్రిల్ 14 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. నితీశ్ కుమార్ రాజ్యసభలోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశంగా భావిస్తున్నారు.

నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఆయనకు ‘Z ప్లస్’ భద్రత కొనసాగుతుందని బిహార్ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Z+ భద్రత అంటే భారతదేశంలో అత్యున్నత భద్రతా స్థాయి.సుమారు 55 మంది భద్రతా సిబ్బంది,పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు (PSOs), ఆయుధధారులు
ఎస్కార్ట్ వాహనాలు, 24 గంటల పర్యవేక్షణ ఉండనుంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి ప్రముఖులకు ఈ భద్రత ఇస్తారు.

మార్చి 16న నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మార్చి 30న బిహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలు బిహార్‌లో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఊహాగానాలకు దారితీశాయి.

రాజ్యాంగ ప్రకారం, శాసనసభ లేదా శాసన మండలి సభ్యుడు కాకపోయినా, ఒక వ్యక్తి 6 నెలల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -