బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నారని చర్చ మొదలైంది. అయితే శుక్రవారం పట్నా విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన సమయంలో నిశాంత్ పక్కనే ఉండగా, పార్టీ ఆయనను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటోందని ఝా తెలిపారు.
ఝా మాట్లాడుతూ పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు—అందరూ నిశాంత్ జీ పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటున్నారు. మేమంతా అదే కోరుకుంటున్నాం. కానీ తుది నిర్ణయం ఆయనదేనని వెల్లడించారు.
ఇక నిశాంత్ మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు. ఇది అంతా ప్రజల ఆశీస్సులే. ప్రజలు మాపై మరోసారి నమ్మకం ఉంచారు. తండ్రి గతంలో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని నెరవేర్చారు. ఈసారి కూడా అదే జరుగుతుంది అని చెప్పారు.
నితీశ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బలహీనంగా ఉండటంతో, నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ వేగంగా పెరిగింది. పలువురు జేడీయూ నేతలు, కార్యకర్తలు, ఎంపీలు నిశాంత్ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు. గతంలో ఝా కూడా ఈ విషయంపై 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. నితీశ్ కుమార్ నిర్మించిన పార్టీ ఇది. ఈ ఎన్నికల తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా… పార్టీ మొత్తం దానిని అంగీకరిస్తుంది అని ఝా తెలిపారు.
