- Advertisement -

టీడీపీకి ఏ ఆప్షన్ లేదు..మిగిలింది ఎమోషనే పాలిటిక్సే!

- Advertisement -

అవినీతి కేసుల్లో పీకల్లోతూ కూరుకుపోయింది టీడీపీ. చంద్రబాబు సీఎంగా అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అందుకే తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు బాబు. ఇక ఇన్నాళ్లూ జగన్ ను చంచల్ గూడ జైలు అని విమర్శించిన టీడీపీ నేతలకు ఇప్పుడు చంద్రబాబుకు రాజమండ్రి జైలు అని పిలిచే పరిస్థితి వచ్చింది.

ఇక బాబు అరెస్ట్ అయి నెల రోజులు దాటింది. మూడోసారి అక్టోబర్ 19 వరకు బాబు రిమాండ్‌ను పొడగించింది న్యాయస్ధానం. ఇక బాబుకు ఇప్పట్లో బెయిల్ వస్తుందా అంటే అనుమాననే. టీడీపీ అవినీతి కేసుల్లో సీబీఐ ఎంట్రీ అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అండ్ కో కు రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఇక బాబు బెయిల్ కోసం ఆయన తరపు లాయర్లు ఎంత ప్రయత్నించిన సఫలం కావడం లేదు.

దీంతో టీడపీ నేతల ముందు ఉందున్న ఆప్షన్ ఒక్కటే ఎమోషనల్ పాలిటిక్స్. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యంపై వదంతలు సృష్టించడం ద్వారా ప్రయోజనం పొందాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.కానీ ఇది పూర్తిగా మిస్ ఫైర అవుతోంది. వాస్తవానికి బాబు ఆరోగ్యంపై ఆయన అరెస్ట్ అయిన దగ్గరి నుండి ఎల్లో మీడియా అసత్యాలే ప్రచారం చేస్తోంది. తొలుత దోమలతో బాబును చంపే కుట్ర, జైలులో బాబుకు భద్రత లేదని తాజాగా స్టెరాయిడ్స్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే బాబు ఆరోగ్యం పూర్తిగా క్షణించిందని, ఆయన 5 కిలోల బరువు తగ్గారని ప్రచారం చేశారు. అయితే తర్వాత జైళ్ల శాఖ వివరణ తర్వాత టీడీపీ నేతలు ఏం మాట్లాడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో హస్తిన పర్యటన ముగించుకుని హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్న లోకేష్‌…బాబు విడుదలపై నమ్మకం వ్యక్తం చేశారు. కానీ బెయిల్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఎమోషన్‌ పాలిటిక్స్‌ను పండించి లబ్ది పొందాలని చూస్తున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో బాబుపై సింపతి వర్కవుట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో లోకేష్ అండ్ టీం చేస్తున్న ఈ ఎమోషన్ పోరాటం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -