- Advertisement -

మ‌రోసారి కొలిక‌పూడి వ‌ర్సెస్ కేశినేని

- Advertisement -

తిరువూరు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. స్థానిక మెప్మా (MEPMA) ఎన్నికల నిర్వహణ విషయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరియు ఎంపీ కేశినేని చిన్ని వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మెప్మా కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

మెప్మా ఎన్నికలను ఎంపీ కేశినేని చిన్ని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఎంపీ వర్గం ఐదుగురు సభ్యులను కిడ్నాప్ చేయించిందని, మరో నలుగురు సభ్యులను వారి ఇళ్లలోనే నిర్బంధించి రౌడీలతో కాపాలా పెట్టించారని ఆయన మండిపడ్డారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీకి వచ్చే నష్టం ఏమిటి? అన్యాయంగా, అక్రమ మార్గాల్లో గెలవాలని చూస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే హెచ్చరించారు.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకే ఎన్నికలు ప్రారంభం కావాల్సి ఉండగా, సభ్యుల గైర్హాజరీతో జాప్యం జరిగింది. గంటలోపు నిర్బంధించిన సభ్యులందరినీ తీసుకొచ్చి ఎన్నికలు జరిపించాలని కొలికపూడి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు కూడా భారీ సంఖ్యలో మెప్మా కార్యాలయానికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయ పరిసరాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఈ స్థాయిలో విభేదాలు బయటపడటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

5 గురు సభ్యుల కిడ్నాప్, 4 గురు సభ్యుల నిర్బంధంపై ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. షెడ్యూల్ ప్రకారం వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేసిన కొలికపూడి..రౌడీయిజంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తే ఊరుకోం అని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -