- Advertisement -

భారత్‌తో మ్యాచ్‌పై పాక్ ప్రధాని క్లారిటీ

- Advertisement -

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చివరికి స్పందించారు. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం బంగ్లాదేశ్‌కు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1న పాకిస్తాన్ ప్రభుత్వం, 20 జట్లతో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో తమ సీనియర్ పురుషుల జట్టు పాల్గొంటుందని, అయితే ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం ఆడబోమని తెలిపారు. భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించిన కారణంగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించడంపై పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనే అంశంపై ఐసీసీకి వ్యతిరేకంగా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకుందని తెలిపారు షెహబాజ్ షరీఫ్.టీ20 వరల్డ్‌కప్ విషయంలో మేం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. భారత్‌తో మ్యాచ్‌ను మేం ఆడము అని ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ప్రధాని అన్నారు.

క్రీడల్లో రాజకీయాలకు చోటు ఉండకూడదు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం బంగ్లాదేశ్‌తోనే ఉన్నాం. ఇది సరైన, న్యాయమైన నిర్ణయమే అని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1న పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రకటన అనంతరం, ఈ నిర్ణయం దేశ క్రికెట్‌పై దీర్ఘకాలిక ప్రభావాలు చూపవచ్చని పేర్కొంటూ ఐసీసీ పాకిస్తాన్‌ను పునరాలోచించమని కోరింది.

అయితే ఈ విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ఐసీసీకి లేఖ రాయలేదని గమనించాల్సిన విషయం. సంబంధిత వర్గాల మధ్య గోప్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -