అమరావతి రాజధాని అంశంపై ఏపీలో మళ్లీ రాజకీయ సెగ మొదలైంది. ఇటీవల ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, వాటిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదని, ప్రకృతి సిద్ధంగానే అక్కడ ఇబ్బందులు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని …అమరావతిని ఎవరో వచ్చి ఆపాల్సిన పనిలేదు. నెల రోజులు ఓపిక పట్టండి.. నాలుగు చినుకులు పడితే చాలు, అమరావతి అదే ఆగిపోతుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాజధాని ప్రాంతం లోతట్టు ప్రాంతమని, వర్షాకాలంలో అక్కడ నిర్మాణాలు ఎంతవరకు సాధ్యమన్నది సందేహమేనని ఆయన అభిప్రాయపడ్డారు. పసుపు రక్తం ప్రవహిస్తున్న సంస్కారం లేని మృగాలు మొరుగుతున్నాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు…కేవలం రాజకీయ లబ్ధి కోసమే అమరావతి జపం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్‌పై అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
