- Advertisement -

CSK:పేరుకే ఆల్‌రౌండర్‌..బౌలింగ్‌కే దూరం!

- Advertisement -

ఐపీఎల్ 2026లో సీఎస్‌కే జట్టు వ్యూహంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. భారీ మొత్తంలో ₹14.2 కోట్లకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను బౌలింగ్‌లో ఒక్క ఓవర్ కూడా వినియోగించకపోవడం చర్చనీయాంశమైంది.

సీజన్‌కు ముందు సీఎస్‌కే వీర్‌ను కేవలం బ్యాట్స్‌మన్‌గా కాకుండా, ఎడమచేతి స్పిన్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేసింది. జట్టుకు బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడమే లక్ష్యంగా అతనిపై భారీ పెట్టుబడి పెట్టింది. కానీ ఇప్పటివరకు ఆ ప్లాన్ పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లపై ఆడిన రెండు మ్యాచ్‌లలో వీర్‌కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఆర్సీబీ మ్యాచ్‌లో సీఎస్‌కే 250 పరుగులు ఇచ్చినప్పటికీ, అతనిని బౌలింగ్‌కు ఉపయోగించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేసిన ఆటగాడిని కేవలం బ్యాటింగ్‌కే పరిమితం చేయడం జట్టు వ్యూహంపై సందేహాలు రేకెత్తిస్తోంది.

వీర్‌కు చెల్లించిన ₹14.2 కోట్లను లీగ్ మ్యాచ్‌లకు భాగిస్తే, ఒక్కో మ్యాచ్‌కు సుమారు ₹1.01 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో బౌలింగ్ విలువను మాత్రమే తీసుకుంటే దాదాపు ₹50 లక్షలు ప్రతి మ్యాచ్‌కు వస్తాయి. అంటే ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో సీఎస్‌కే సుమారు ₹1 కోటి విలువైన బౌలింగ్‌ను వాడకుండానే వదిలేసినట్టే.

అతను ఆల్‌రౌండర్ అయితే బౌలింగ్ ఎందుకు ఇవ్వడం లేదు?,బౌలింగ్‌పై నమ్మకం లేకపోతే, ఇంత భారీ మొత్తం ఎందుకు పెట్టింది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి సీఎస్‌కే జట్టు ఎంపికలో గందరగోళాన్ని చూపిస్తోంది. ఆల్‌రౌండర్‌ను ఉపయోగించకపోతే, జట్టు బ్యాలెన్స్ దెబ్బతింటుంది.టి20 క్రికెట్‌లో ఆల్‌రౌండర్ పాత్ర చాలా కీలకం. ఒక అదనపు బౌలర్ ఉండటం కెప్టెన్‌కు మ్యాచ్‌ను మార్చే అవకాశం ఇస్తుంది. కానీ ఆ ఆప్షన్‌ను పూర్తిగా వాడకపోవడం వల్ల సీఎస్‌కే తనకే నష్టం చేసుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -