- Advertisement -

సహజీవనం హక్కే..రాజస్థాన్ హైకోర్టు సంచలనం

- Advertisement -

రాజస్థాన్ హైకోర్టు యువతీ–యువకుల సహజీవనంపై కీలకమైన, వివాదాస్పదంగా మారే అవకాశమున్న ఒక సంచలన తీర్పును వెలువరించింది. వివాహ వయస్సు రాలేదన్న కారణం ఒక్కటే ఆధారంగా మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తుల సహజీవన హక్కును నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అందించిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవన హక్కు ఇలాంటి సంబంధాలపై కూడా వర్తిస్తుందని న్యాయస్థానం పేర్కొంది.

ఇది 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు కలిసి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో వెలువడిన తీర్పు. ఈ జంట పరస్పర అంగీకారంతో సహజీవనం కొనసాగిస్తున్నామని కోర్టుకు స్పష్టంచేసింది. అయితే యువతి కుటుంబ సభ్యులు తమ ప్రేమను, సహజీవన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర బెదిరింపులు చేస్తున్నారని, ప్రాణహానికి గురయ్యే పరిస్థితి ఉందని వారు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ, తమకు రక్షణ కల్పించాలని జంట కోర్టు ఆశ్రయించింది.

ఈ కేసులో, యువకుడు ఇంకా వివాహ వయస్సు (21 ఏళ్లు) దాటకపోవడంతో వారి సహజీవనం చట్టబద్ధం కాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అయితే ఈ వాదనను జస్టిస్ అనూప్ ధండ్ కఠినంగా తోసిపుచ్చారు. సహజీవనం భారతీయ చట్టాల ప్రకారం నేరం కాదని, ఇద్దరూ మేజర్లు కావడంతో వారి వ్యక్తిగత ఎంపికను ఎవరూ అడ్డుకోలేరని తీర్పు ఇచ్చారు. “వివాహ వయస్సు, సహజీవనం హక్కుపై ఆంక్షగా పరిగణించలేము. వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగం స్పష్టంగా రక్షిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.

జంటపై యువతి కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన హైకోర్టు, తక్షణమే వారికి రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు సహజీవనం హక్కులపై దేశవ్యాప్తంగా కొత్త చర్చలకు దారితీసే అవకాశముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -