Monday, April 29, 2024
- Advertisement -

ఆగని రాజీనామాలు..బాబు,పవన్‌ అంతేనా!

- Advertisement -

టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చినప్పటి నుండి రెండు పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రధానంగా సీట్లు దక్కని సీనియర్ నేతలు రాజీనామా బాట పట్టారు. ఇక రెండో లిస్ట్ వచ్చే సరికి ఈ రెండు పార్టీల నుండి రాజీనామా చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రాజీనామా చేయగా తాజాగా అనకాపల్లి నియోజకవర్గం టికెట్ దక్కకపోవటంతో జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు పరుచూరి భాస్కర్ ప్రకటించారు. కమ్మ కులంలో పుట్టడం తాను చేసిన తప్పని కన్నీటి పర్యంతం అయ్యారు.

అలాగే పాడేరు టికెట్ దక్కకపోవడంతో గిడ్డిశ్వరీ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పెందుర్తి సీటు బండారు సత్యనారాయణకు కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. నెల్లూరులో సోమిరెడ్డి అనుచరులది ఇదే పరిస్థితి. మాడుగుల నియోజకవర్గం టికెట్ రామానాయుడుకు ఇవ్వాలని లేకుంటే రాజీనామా చేస్తామని ఆయన అనుచరులు హెచ్చరించారు. ఇక గండి బాజ్జి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

మాజీ మంత్రి గంట శ్రీనివాస్ రావు సైతం భీమిలి టికెట్ కోసం పట్టుబట్టగా చంద్రబాబు నిరాకరించారు. దీంతో అనుచరులతో సమావేశం తర్వాత పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వనున్నారు గంటా. పీఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో టీడీపీ తరపున టికెట్ ఆశించిన వర్మ వర్గీయులు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇలా మరికొంతమంది నేతలు సైతం రాజీనామా బాటలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -