Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీ – జనసేనకు షాకిచ్చిన ఈసీ..

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభ ఫెయిల్యూర్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ – జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పరిధిలో లేని అంశంపై మాకు ఫిర్యాదు చేశారని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.దీంతో ఎన్డీయే సభ ఫెయిల్యూర్ ని పోలీసులపై నెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ -జనసేనకు షాక్ తగిలింది. పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈసీకి ఫిర్యాదు చేయగా సీఈవో సమాధానంతో ఈ రెండు పార్టీల బండారం బట్టబయలైంది.

ప్రధాని సభ, భద్రత కేంద్రం హోంశాఖ,ఎస్పీజీ పరిధిలో ఉంటాయని… ఎన్నికల కమిషన్ కి ఇందులో ఎలాంటి పాత్ర ఉండదు అని తెలిపారు సీఈవో ముఖేష్. తనకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేనని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ- టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేన అధినేత పవన్‌ లు చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభకు ఊహించినంత జనం రాకపోగా ప్రజాస్పందన కూడా కరువైంది. కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడంతో ప్రధాని మాట్లాడుతుండగా మైక్‌ కూడా కట్ అయింది. అయితే ఈ నెపాన్ని పోలీసులపై వేసి తప్పించుకోవాలని టీడీపీ -జనసేన నేతలు భావించగా ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -