Saturday, May 4, 2024
- Advertisement -

రాజానగరం రాజు ఎవరో?

- Advertisement -

రాజానగరం..ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా ఉంటుంది. ఎన్నికల సమయంలో రణరంగాన్ని తలపించే రాజనగరం స్థానాన్ని జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడి నుండి కాపు సామాజికవర్గం నేత బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తుండగా వైసీపీ నుండి జక్కంపూడి రాజా మరోసారి బరిలో నిలిచారు. వాస్తవానికి రాజనగరమే కాదు గోదావరి జిల్లాలో జక్కంపూడి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది.

తల్లిదండ్రుల రాజకీయ వారసత్వంతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు జక్కంపూడి రాజా. 2009లో రాజానగరం అసెంబ్లీ ఏర్పడగా 2009, 2014లో టీడీపీ గెలవగా 2019లో వైసీపీ గెలుపొందింది. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ… మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.జడ్పీటీసీగా పనిచేసిన బలరామకృష్ణ…ఆ తర్వాత ఎమ్మెల్యే రాజాతో విభేదించి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండగా పోటీ ఆసక్తిరంగా మారింది.వాస్తవానికి టీడీపీ తరపున టికెట్ కోసం బొడ్డు వెంకటరమణ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వపన్ పట్టుబట్టడంతో విధిలేని పరిస్థితుల్లో జనసేనకు కేటాయించగా టీడీపీ నుండి ఎంతవరకు సహకారం లభిస్తుంది అన్నది ప్రశ్నార్థకమే.

ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు రాజా. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు. గడపగడపకు కార్యక్రమం విజయవంతం చేయడంలో నూటికి నూరు మార్కులు పొందారు రాజా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు పొందారు. మొత్తంగా రాజానగరం నియోజకవర్గంలో ఫైట్‌ చాలా ఇంట్రస్టింగ్‌గా మారగా గెలుపు ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -