- Advertisement -

హైడ్రా…సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

- Advertisement -

హైడ్రా ఈ పేరు వింటేనే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు. చెరువులు,కుంటలు,ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు హైడ్రా అధికారులు. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎప్పుడు తమ ఇంటిని కూల్చేస్తారోనని నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే హైడ్రా కూల్చివేతలపై వ్యతిరేకత వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నిధులతో కార్యాలయ నిర్వహణకు అవసరమైన వాహనాల కొనుగోలు, ఇతర కార్యకలాపాలను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు

ఇప్పటికే హైడ్రాకు విస్తృత అధికారులు కల్పించడమే కాదు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. హైడ్రా చర్యలతో పబ్లిక్ స్థలాలను ఆక్రమణల నుంచి విముక్తి లభించడమే కాదు మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించింది. త్వరలో ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్స్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -