- Advertisement -

వైఎస్సార్‌సీపీపై కక్షసాధింపు: సజ్జల

- Advertisement -

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణ వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసే కోణంలోనే జరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య లడ్డూ కల్తీ అంటూ భక్తుల మీద విష ప్రచారం చేశారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే అన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు లడ్డూ ఇష్యూ, పరకామణి వంటి పాత కేసులను మళ్లీ తెరపైకి తెచ్చారు” అని సజ్జల విమర్శించారు. పరకామణి కేసులో సీఐది హత్య అని TDP సోషల్ మీడియాలో ఎలా ఆరోపణలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.అప్పులు, భూముల లూటీ:చంద్రబాబు ప్రకటనల ప్రకారం చూస్తే, ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే కోటి కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఉండాలని, కానీ నిజంగా వచ్చాయా అని సజ్జల నిలదీశారు. రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని ఆరోపిస్తూ, “విశాఖలాంటి ఏరియాలో 99 పైసలకే భూమి ఇచ్చారు. రియల్ ఎస్టేట్ కోసం వాడుకోమని చెబుతున్నారు అన్నారు.

హైదరాబాద్‌లోలాగా వేలం వేస్తే ధర ఎక్కువగా వచ్చి, ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది” అని ఆయన సూచించారు.”వందలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సంస్థలు భూములు కొనలేవా? అమరావతి పేరుతో లక్ష కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారు. రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారు?” అని ప్రశ్నించారు.రైతుల సమస్యలు:రైతుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందని సజ్జల ప్రశ్నించారు. “ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. బీమా సౌకర్యం లేదు. జగన్ తెచ్చిన సంస్కరణలను అమలు చేసినా రైతులు బాగుపడేవారు. అది కూడా చేయకుండా ఆపేశారు” అని ఆయన మండిపడ్డారు.హైదరాబాద్‌లో జగన్ కోసం ర్యాలీ చేశారనే ఆరోపణ సరికాదని, ‘రప్పా రప్పా’ అనేది సినిమా డైలాగ్ అని, దానికి కూడా TDP నేతలు మరియు ఎల్లో మీడియా భయపడుతోందని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -