Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీ- జనసేన ఫస్ట్ లిస్ట్.. సీట్ల రచ్చ

- Advertisement -

టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిందో లేదో అప్పుడే పంచాయతీ మొదలైంది. సీట్లు ఆశీంచి భంగపడ్డ టీడీపీ సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 118 స్థానాలతో లిస్ట్ ప్రకటించగా ఇందులో టీడీపీ 94,జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనుందని తెలిపారు.

అయితే 118 మంలో కేవలం ఒకే ఒక్క సీటు(నంద్యాల ఫారూఖ్) మాత్రం ముస్లిం మైనారిటీలకు ఇచ్చారు. ఇది ముస్లిం మైనారిటీల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది అని ఆ పార్టీ నేతలే మండిపడుతున్నారు.

ఇక పొత్తులో భాగంగా సీట్లు కొల్పోయిన నేతలతో పాటు సొంతపార్టీ నేతల నుండి గట్టిపోటీ ఎదుర్కొని టికెట్ రాని నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రధానంగా ఆలపాటి రాజా యరపతినేని శ్రీనివాస్ ,రాజానగరం సీటు ఆశీంచి భంగపడ్డ బొడ్డు వెంకటరమణ, గొరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత,మాజీ ఎమ్మెల్యే శివరామరాజు,రమేష్ రెడ్డి, ద్వారాకానాథరెడ్డిలతో పాటు మరికొంతమందికి సీటు దక్కలేదు. దీంతో వీరిలో మెజార్టీ నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడెం,నర్సాపురంలో జనసేనతో సీట్ల పంచాయితీ కొలిక్కి రాలేదు. దీంతో ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.అలాగే మరికొన్ని స్థానాల్లో పీటముండి వీడకపోవడంతో వాటిని ప్రకటించలేదు. మొత్తంగా టీడీపీ లిస్ట్ తర్వాత అంతా సర్థుకుంటుందని భావించిన చంద్రబాబు, పవన్‌లకు నిరాశే ఎదురైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -