Sunday, May 5, 2024
- Advertisement -

ఏదైనా చంద్రబాబు విడుదల తర్వాతే!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తు పొడిచిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ సానుభూతి సంగతి పక్కన పెడితే ఈ రెండు పార్టీల నేతలు మాత్రం సీట్ల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పనపై తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా..? లేదా ఎవరికి వారే టీడీపీ, జనసేన మేనిఫెస్టో సపరేట్‌గా రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

వాస్తవానికి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహించిన మహానాడులో టీడీపీ మినీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఇందులో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులే టార్గెట్‌గా పథకాలను ప్రవేశ పెట్టారు. ఇక మినీ మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. ఇది ట్రైలరేనని సినిమా ముందుందని ప్రకటించారు. అంతేగాదు దసరా కానుకగా మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అవినీతి కేసుల రూపంలో రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు. ఇప్పటికి నెల రోజులు అయింది చంద్రబాబు రిమాండ్‌లో ఉండి..ఆయన ఎప్పుడు బయటికి వస్తారో తెలియని పరిస్థితి. ఇక చంద్రబాబు బయట ఉన్న సమయంలో మేనిఫెస్టో రూపొందించేందుకు కమిటీలను నియమించిన బాబు జైల్లో ఉండటంతో ఆ కమిటీ ముందుకు కదలని పరిస్థితి. దీంతో ఇప్పట్లో టీడీపీ మహా మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక కేసుల మీద కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చంద్రబాబు. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో బాబు అరెస్ట్ అవడం పక్కా అని టీడీపీ నేతలే చెబుతున్న పరిస్థితి. దీంతో టీడీపీ మహా మేనిఫెస్టోకి బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెండు పార్టీలు వేర్వేరుగా కొన్ని హామీలను ప్రకటించగా ఆ హామీల సంగతేంటి..? అన్నది ప్రశ్నార్థకమే. ఇక ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న డిసైడ్ చేసేది మేనిఫెస్టోనే. అందుకే చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మేనిఫెస్టోపై కసరత్తు చేయడం కష్టమేనని భావించిన టీడీపీ వర్గాఆలు ఆ పనిని అటకెక్కించి బాబు విడుదల తర్వాతే అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. మరి బాబు బయటికి వచ్చేది ఎప్పుడు…టీడీపీ మేనిఫెస్టో విడుదలయ్యేది ఎప్పుడు అన్న దానిపై కాలమే సమాధానం చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -