ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అని బెదిరిస్తున్నారు… చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు మాజీ సీఎం జగన్. మీడియాతో మాట్లాడిన జగన్.. మా పార్టీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నారు. లిక్కర్ కేసులో ఉన్నపళంగా చెవిరెడ్డి పేరు ఎందుకు వచ్చింది?, నా పర్యటనకు ముందు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు అన్నారు.
ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి? బెదిరింపులు ఏంటి? చెప్పాలన్నారు జగన్. వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏంటి?, ప్రజలు దయతలిచి అధికారం ఇచ్చారు… ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి అబద్దాలతో, మోసాలతో చంద్రబాబు పరిపాలన చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనందుకు గన్ మెన్ ను చిత్రహింసలు పెట్టారు… దీంతో డీజీపీ, రాష్ట్రపతికి ఆ గన్ మెన్ లేఖ రాశారు అన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే నక్సలిజం పుడుతుంది అన్నారు. చంద్రబాబుకు ఎందుకు అంత భయం? అసహనం?, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇద్దరు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అన్నారు.
పార్టీ కార్యకర్తలను, ప్రజలను పరామర్శించడం తప్పా?, ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి?..కార్యకర్తలను ఎందుకు ఎక్కడికక్కడ కట్టడి చేశారు..? అన్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవకూడదా..?,ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఓ విప్లవం వచ్చింది అన్నారు.
