- Advertisement -

భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్.. జగన్ పోస్ట్

- Advertisement -

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కీలక ఘట్టమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘విజన్ వైజాగ్’ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ పోస్టు చేశారు.

వైసీపీ పాలనలో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాజెక్టుకు వేగవంతంగా అన్ని అనుమతులు సాధించామని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికుల పునరావాసం, భూసేకరణ ప్రక్రియ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం వైసీపీ హయాంలోనే పూర్తయిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ సక్సెస్ కావడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం టెర్మినల్‌కు సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ప్రయాణించారు.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో భారీ ఊతం లభించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైజాగ్‌ను అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఈ ఎయిర్ పోర్టు కీలక పాత్ర పోషించనుంది.

https://publish.twitter.com/?url=https://twitter.com/ysjagan/status/2007706696760840490

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -