- Advertisement -

రైతులను ఆదుకోండి..జగన్ డిమాండ్

- Advertisement -

వైసీపీ అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌చార్జ్‌లకు ఆదేశిస్తూ, సైక్లోన్ మొంథా వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, రైతులకు తగిన మద్దతు అందించేందుకు టిడిపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. తుఫాన్ వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సమీక్షించారు.

సైక్లోన్ మొంథా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటి బలహీనపడినా, అది వ్యవసాయరంగానికి ఎంత నష్టం కలిగించిందో అంచనా వేయడం చాలా ముఖ్యం అన్నారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు 25 జిల్లాలు ఈ తుఫాన్ వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి…మొత్తం 396 మండలాల్లోని 3,320 గ్రామాల్లో రైతులు వర్షాల వల్ల నష్టపోయారని తెలిపారు.

ఇందులో వరి – 11 లక్షల ఎకరాలు,పత్తి – 1.14 లక్షల ఎకరాలు,వేరుశెనగ – 1.15 లక్షల ఎకరాలు,మొక్కజొన్న – 2 లక్షల ఎకరాలు,ఉద్యాన పంటలు – 1.19 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలిపారు జగన్. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ క్లిష్ట సమయంలో రైతులకు అండగా నిలవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అకాల వర్షాలు, తుఫాన్ల సమయంలో రైతులకు విస్తృత సహాయం అందించామని గుర్తు చేశారు.

ప్రస్తుత రైతు సంక్షోభం…మనుషుల వల్ల ఏర్పడిన విపత్తు అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.ఇప్పటికైనా టిడిపి ప్రభుత్వం రైతుల బాధలను తొలగించేందుకు పారదర్శక పంట నష్టం అంచనా వేయించి, తగిన ఆర్థిక సహాయం అందించాలి, అని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -