- Advertisement -

మత్స్యకారులకు అండగా జగన్!

- Advertisement -

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా నిలిచారు. బుధవారం ఆయన హార్బర్ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా ఆంక్షలు విధించినప్పటికీ, మత్స్యకార సోదరులు వాటన్నింటినీ దాటుకుని పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ నేతను చూడగానే మత్స్యకారులు భావోద్వేగానికి గురయ్యారు.

హార్బర్ మా జీవితాల్లో వెలుగులు నింపింది..ఈ ముఖాముఖిలో పాల్గొన్న పలువురు మత్స్యకారులు తమ గత కష్టాలను గుర్తు చేసుకున్నారు.గతంలో తెప్పలపై సముద్రంలోకి వెళ్లడం, చేపలు పట్టుకొచ్చి అమ్ముకోవడం మాకు పెద్ద సవాల్‌గా ఉండేది…జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హార్బర్‌ను నిర్మించి మా జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ రోజు ఇది అందుబాటులోకి రావడంతో మా కష్టాలు తీరాయి అన్నారు.హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తే తాము మళ్లీ వీధిన పడతామని మత్స్యకారులు తమ ఆందోళనను జగన్ వద్ద వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.మూలపేట, మచిలీపట్నం పోర్టులకు సంబంధించి భూసేకరణ పూర్తి చేసి, అన్ని అనుమతులు తీసుకుని, బ్యాంకులతో అనుసంధానం చేసి పనులను పట్టాలెక్కించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మత్స్యకారుల ప్రయోజనాలే పరమావధిగా మేము ఈ ప్రాజెక్టులను చేపట్టాం అన్నారు.

ప్రభుత్వ ఆస్తులను, మత్స్యకారుల జీవనాధారమైన హార్బర్‌లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు.మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. మీ హక్కుల కోసం ఎక్కడైనా, ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధం అని భరోసా ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో రికార్డు సమయంలో జువ్వలదిన్నె హార్బర్‌ను పూర్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -