ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో నుంచి ఎవరు ఊహించని విధంగా ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యారు. తెలియకుండానే ఆదర్శ్ చేసిన ఆ మూడు తప్పులే ప్రిన్స్ ఎలిమినేషన్ కి కారణమయ్యాయి చాలా మంది భావిస్తున్నారు. అయితే ఎలిమినేషన్ లో ఆదర్శ్ కాని అర్చన కాని ఎలిమినేట్ అవుతారని భావించారు. కాని ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యారు. మరి ఆదర్శ్ చేసిన ఆ మూడు తప్పులు ఏంటో చూద్దాం..
* బిగ్ బాస్ లో నవదీప్ చాల స్ట్రాంగ్ కంటెస్టెంట్. బయట చూస్తున్న ప్రేక్షకులకు కూడా అతనిపై సానుకూల అభిప్రాయం ఉంది. అయితే ఈ విషయం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు మాత్రం తెలియదు. ఆదర్శ్ తో సహా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారు నవదీప్ ని టార్గెట్ చేయడంతో ప్రేక్షకుల్లో అతనికి మంచి ఇమేజ్ ఏర్పడుతుంది. అందువల్ల నవదీప్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. నవదీప్ వైల్డ్ కార్డు ఎంట్రీ వల్ల వచ్చాడు అని పదే పదే ఆదర్శ్ అనడం వల్ల అతని వీక్ నెస్ బయటపడింది. దాంతో అతను చులకన అయిపోయాడు. దాంతో ఓట్లు ఎక్కువగా నవదీప్ కి పోల్ అయ్యాయి. ఇక మిగిలినవాళ్ళకి ఓట్ల శాతం తగ్గిపోయింది.
* అయితే కెప్టేన్సి జరిగినప్పుడు నవదీప్ ని కాదని దీక్షా కి ఓటు వేసాడు ఆదర్శ్. దీంతో దీక్షా ఎలిమినేషన్ నుండి తప్పుకున్నారు. నవదీప్ ఎలినేషన్ కి ఎంటర్ అవ్వగానే ఓట్లు అన్ని ఒక్కసారిగా పోలయ్యాయి. అలా తనకు తెలియకుండానే ప్రిన్స్ కి గట్టి పోటిదారుడైన నవదీప్ ని ఎలిమినేషన్ రౌండ్ లోకి తీసుకువచ్చి ప్రిన్స్ ఎలిమినేట్ అవ్వడంనికి కారణమయ్యాడు ఆదర్శ్.
* అయితే ఈ మధ్య బిగ్ బాస్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల ఆదర్శ్ డిప్రెషన్ కి లోనైయ్యాడు. తానూ ఇక బిగ్ హౌస్ లో ఉండనని అక్కడినుండి వెళ్ళిపోవడమే మంచిదని భావించాడు. దాంతో అతనిపై ప్రేక్షకులకు సానుభూతి ఏర్పడింది. ఆ సానుభూతి ఫలితమే ఆదర్శ్ కి ప్రిన్స్ కి మధ్య జరిగిన పోటాపోటీ పోలింగ్ లోనే ఆదర్శ్ గెలిచాడు ప్రిన్స్ ఓడిపోయాడు. మొత్తంగా ఆదర్శ్ తన ఆట తాను ఆడాడు, ఇందులో అనుకోని ట్విస్టులు చోటు చేసుకొని ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదర్శ్ చేసిన పనిలో తప్పు లేదు. కాని ఆదర్శ్ ఆడుతున్న ఆటలో తాను అనుసరించిన ఊహాలు తప్పుగా అనుసరించడం బాధగా ఉందని అంటున్నారు.
