వరస విజయలతో తన సత్తా చాటాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపధించుకున్నాడు. ఇటివలే రాజమౌళికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఐతే ఈ సినిమా షూటింగ్ రిసేంట్ గా కేరళలో షూటింగ్ జరుపుకోంది.
ఐతే కేరళలో రాజమౌళిపై కేస్ పైల్ అయ్యింది. అవును కేరళ షెడ్యూల్ సమయంలో అనుమతి లేకుండా ఓ ఏనుగును ఈ సినిమా కోసం వినియోగించారట. ఈ విషయం తెలుసుకున్న జంతు సంరక్షణ టీం వారు ‘బాహుబలి’ చిత్ర యూనిట్ సభ్యులపై కేసులు పెట్టింది. అలా కేరళలో బాహుబలి టీం పై కేస్ పైల్ అయ్యింది.
ఐతే బాహుబలి సినిమా దర్శకుడు మరియు నిర్మతలపై కేరళ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి అని కేరళ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐతే కొంది మంది న్యాయవాదులు ఇది చిన్న కేసు అని వివరణ ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఇక బాహుబలి సినిమా విషయానికి వస్తే మరో షేడ్యూల్ హైదరాబాద్ ఉండబోతుందట. బాహుబలి సినిమా సంచలనం సృష్టించడంతో ఇప్పుడు బాహుబలి 2 సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.
