Sunday, May 19, 2024
- Advertisement -

బోయపాటి శ్రీను మీద క్రిమినల్ కేసు

- Advertisement -

గోదావరి పుష్కరాలు అందరూ మర్చిపోయి ఉండచ్చు గానీ అక్కడ జరిగిన తొక్కిసలాట విషయం మాత్రం ఇప్పటి వరకూ ఒక్కరం కూడా మర్చిపోలేదు. ఈ తొక్కిసలాట వెనకాల డాక్యుమెంటరీ తీయాలి అనే ఆలోచన ఉంది అనీ దాని కారణంగానే ఈ తొక్కిసలాట జరిగంది అని అప్పట్లో వార్తలు విపరీతంగా వచ్చాయి.

అయితే తొక్కిసలాట కారణంగా చనిపోయిన 29 మంది కుటుంబాలనీ ప్రభుత్వం ఆదుకుంది, కానీ దీనికి కారణం ఎవరు అనే విషయం లో దర్యాప్తు సరిగ్గా సాగట్లేదు. ఈ డాక్యుమెంటరీ కోసం డైరెక్టర్ బోయపాటి శ్రీను నేతృత్వం లోనే ఇదంతా జరిగింది అనీ షూటింగ్ లో జనం ఉన్నట్టు చూపించడం కోసమే చాలా సేపు జనాన్ని ఆపేసారు అని దీనికి కారణం బోయపాటి అని అప్పట్లో మీడియా చెప్పింది.

ఐతే ఏడాది విరామం తర్వాత ఇప్పుడు మరోసారి నాటి విషాదానికి సంబంధించి బోయపాటిపై కేసు నమోదైంది. అమలాపురం కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షవర్ధన్ జీవీ శ్రీరాజ్ పిర్యాదు మేరకు బోయపాటిపై క్రిమినల్ కేసు నమోదైంది. పుష్కరాల సందర్భంగా చంద్రబాబు చేతిలో ఉన్న మైకు తీసుకుని బోయపాటే భక్తుల్ని లోపలికి వదలాలని ఆదేశాలు జారీ చేశాడని.. నాటి విషాదానికి అతనే బాధ్యుడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Related

  1. అఖిల్ కొత్త సినిమా డైరెక్టర్ ఇతనే ?
  2. ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!’
  3. ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!’
  4. వీరప్పన్ భార్య ని దారుణంగా మోసం చేసిన డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -