Sunday, May 5, 2024
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ మీద సెటైర్ వేసిన కెసిఆర్ ?

- Advertisement -

ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీ గాల్లో దీప‌మే! ఇచ్చిన‌ హామీ ఎంత వ‌ర‌కూ నెర‌వేరుతుంతో తెలియ‌దు. అస‌లు ప్యాకేజీలో ఏముందో కూడా పూర్తిగా క్లారిటీ లేదు. దానిలో ఎన్ని లొసుగులున్నాయో ఎవ‌రూ ఊహించ‌లేనిది. ఇచ్చిన‌ మాటను కూడా కేంద్రం నిల‌బెట్టుకుంటుదో.. నెత్తిన టోపీ పెడుతుందో ఎవ‌రికీ తెలియ‌దు.

ఇప్పుడు ఆలు లేదు సూలు లేదు అల్డుడు పేరు సోమ‌లింగం అన్న చందంగా.. తెలంగాణ మంత్రులు కూడా ప్ర‌త్యేక ప్యాకేజీ కోరితే బాగుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఓ మాట వేశారట‌. మంత్రులు హ‌రీష్ రావు, కేటీఆర్ మైండ్ లో కూడా ఈ ఆలోచ‌న ఉంద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విష‌యంపై కేసీఆర్ త‌న స్టైల్లో మంత్రుల‌కు స‌మాధానం ఇచ్చార‌ట‌. ఏపీకి కేటాయించిన ప్యాకేజీతో అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరడం క‌ష్టం., ప్యాకేజీకి కూడా చ‌ట్టబ‌ద్ధ‌త క‌ల్పిస్తేనే న్యాయం జ‌రుగుతుంద‌ని లేక‌పోతే ఏపీ ప‌ని అంతేన‌ని కేసీఆర్ స‌న్నిహితుల వ‌ద్ద అన్నార‌ట‌.

ప్ర‌త్యేక ప్యాకేజీ ద్వారా వ‌చ్చే నిధులు కూడా మంజురు కావ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని ఆయ‌న అన్నారుట‌. మ‌ధ్య‌లో మ‌నం దూరి ప్యాకేజీ అడిగితే కేంద్రానికి చ‌లి జ్వ‌రం రావ‌డం ఖాయ‌మ‌ని చ‌మ‌త్క‌రించార‌ట‌. వాళ్ల నుంచి మ‌న‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు సంబంధించిన నిధులు స‌క్ర‌మంగా ఇస్తే చాలని అన్నార‌ట. అంత‌కు మించి కేంద్రం నుంచి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయ‌డం కూడా క‌రెక్ట్ కాద‌ని మంత్రుల‌తో ముచ్చ‌టించ‌న‌ట్లు ఇన్ సైడ్ టాక్. 

Related

  1. కెసిఆర్ vs చంద్రబాబు
  2. మోడీ ని వశం చేసుకుంటున్న కెసిఆర్ ?
  3. షాకింగ్ నిజం : ఏపీ అంటే మోడీ కి కుళ్ళు .. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు
  4. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా పోతుందా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -