టాలీవుడ్ లో ప్రస్తుతం బాక్స్ ఆఫిస్ వద్ద ముగ్గురి హీరోల మధ్య ఫైట్ బాగానే నడుస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు.. ఒకరిని మించి ఒకరు ప్రమోషన్స్ బాగానే చేశారు. దాంతో ఫస్ట్ డే ఈ మూడు సినిమాలు థియేటర్లు ప్రేక్షకులతో కళకళ లాడింది. రానా-నీతిన్-బెల్లకొండ శ్రీనివాస్ ల మార్కెట్ తగ్గట్టుగా ఎవరికీ వారు బాగానే చిత్రాలను రిలీజ్ చేశారు.
అయితే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాలు బాగానే లాభాలను రాబట్టేటట్లు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ ప్రీమియర్ షోలలో ఏ సినిమాలు వాటి స్థాయికి తగ్గట్లుగా కలెక్షన్స్ ను రాబట్టాయి. అయితే ఇందులో ఎవరు ఊహించని స్థాయిలో రానా ” నేనే రాజు నేనే మంత్రి” మొదటి స్థానంలో ఉంది. ఆ మూవీ ప్రీమియర్ షోల్లో $140,833 వసూళ్లను రాబట్టగలిగింది. బాహబలి ప్రభావం వల్ల ఈ తరహా రికార్డును రానా సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.
ఇక నితిన్ ” లై” $50,623 లను సాధించగా బోయపాటి- బెల్లం కొండ కాంబోలో వచ్చిన “జయ జానకి నాయక” $8,535 లను సాధించి పరవాలేదనిపించాయి. అయితే ఇప్పటి వరకు ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ నే తెచ్చుకున్నాయి. మొదటి రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగోట్టాయి. మరో మూడు రోజుల వరకు కూడా ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి సినిమా సేఫ్ జోన్ లో పడ్డట్టే..అని అంటున్నారు.
