టాలీవుడ్ లో హ్యాపీడేస్ సినిమాతో మంచి హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు వరుణ్. అయితే వరుణ్ సందేశ్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడీయాలో తెగ హల్ చల్ చేసింది.
వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని.. కుటుంబ కలహాల కారణంగానే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లున్న ఫొటోలు కూడా సర్క్యులేట్ అయ్యాయి. వితిక షెరు కూడా సినీ నటి. వరుణ్ సందేశ్ తో కలిసి ఒక సినిమా చేశారు. ఇలా ఏర్పడిన పరిచయంతోనే వారిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు అమెరికాలో ఉండి వచ్చిన వీరు.. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. కాగా, తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తలకు వితిక ఖండించారు. ‘అవన్నీ ఫేక్ న్యూస్. మేం సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దు’ అని వితిక తన ట్విట్ ద్వారా తెలియజేశారు.
ఈ విషయంపై మీడియాతో మాట్లాడతానని ఆమె చెప్పారు. ‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో వరుణ్-వితిక జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ.. కొన్నాళ్ల డేటింగ్ అనంతరమ్ వివాహ బంధంగా మారింది.
