Thursday, April 25, 2024
- Advertisement -

మొబైల్ లాక్ మర్చిపోతే ఇలా చేయండి..!

- Advertisement -

సాధారణంగా స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరు మొబైల్ కు స్క్రీన్ లాక్ పెట్టుకోవడం తప్పనిసరిగా చేస్తుంటారు. పాస్ వర్డ్ లేదా పట్రాన్ లాక్ లేదా ఫింగర్ ప్రింట్ వంటి స్క్రీన్ లాక్స్ ను పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు తెలియకుండా ఇతరులు మన మొబైల్ తీసుకున్నప్పుడు స్క్రీన్ లాక్ ఉండడం వల్ల వారు మన ఫోన్ యాక్సస్ చేయడం కష్టమౌతుంది. దాంతో మన మొబైల్ తీసుకున్న వాళ్ళు తిరిగి మన వద్దకే వచ్చి లాక్ ఓపెన్ చేయించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనం మొబైల్ కు పెట్టుకున్న స్క్రీన్ లాక్ పాస్ వర్డ్ లేదా పట్రాన్ మర్చిపోతుంటాం. అలాంటి సందర్భాలలో చాలా మందికి ఏం చేయాలో అర్థం కాదు. దాంతో మొబైల్ సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్తూ ఉంటారు. అయితే సర్వీస్ సెంటర్లో మొబైల్ లాక్ తీసి ఇచ్చేందుకు వాళ్ళు అధికమొత్తంలో అమౌంట్ చార్జ్ చేస్తూ ఉంటారు. అయితే సర్వీస్ సెంటర్ కు వెళ్లకుండా కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా మన మొబైల్ ను ఈజీగా ఆన్ లాక్ చేయవచ్చు. అవి ఏంటో చూద్దాం..!

1.మొబైల్ యొక్క పాస్ వర్డ్ లేదా పట్రాన్ మర్చిపోయినప్పుడు.. కంప్యూటర్ ద్వారా అన్లాక్ చేయవచ్చు.. ముందుగా కంప్యూటర్ లో “వండర్సెర్స్ అండ్రాయిడ్ పట్రాన్ లాక్ రిమూవ్ ” అనే సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసి అక్కడ చూపించే సూచనల మేరకు ఫాలో అవుతూ మన మొబైల్ లాక్ రిమూవ్ చేసుకోవచ్చు.

2.మొబైల్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా కూడా మొబైల్ ఆన్ లాక్ చేయవచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ కోసం ముందుగా మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ అరువత పవర్ బటన్ మరియు వాల్యూమ్ అప్ బటన్ లేదా డౌన్ బటన్ ( కొన్ని మొబైల్స్ కు మూడింటిని ) ప్రెస్ చేసి అలాగే ఉంచాలి. అప్పుడు ఫ్యాక్టరీ మోడ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎరైజ్ డేటా అనే ఆప్షన్ ఎంచుకోవాలి ( టచ్ వర్క్ చేయదు. కాబట్టి వాల్యూమ్ బటన్స్ ద్వారా కంట్రోల్ చేయాలి) అప్పుడు ఎరైజ్ మొబైల్ ఆల్ డేటా కన్ఫర్మ్ అని అడుగుతుంది. దాన్ని ఒకే చేయడం ద్వారా మొబైల్ లో ఉండే డేటా మొత్తం క్రియర్ అయ్యి మొబైల్ స్టార్టింగ్ లో ఉన్నట్లుగా ఆన్ అవుతుంది. ( అయితే మొబైల్ లో డేటా కోల్పోక తప్పదు )

కాబట్టి ఎప్పుడైనా మొబైల్ లాక్ పాస్వర్డ్ లేదా పట్రాన్ మర్చిపోయినప్పడు ఇలా చేయడం ద్వారా సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Also Read

ఫోన్ వర్షంలో తడిస్తే ఇలా చేయండి..

మొబైల్ ఎక్కడైనా మర్చిపోతే ఇలా చేయండి..!

మీ మొబైల్ హిట్ అవుతోందా.. అయితే ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -