- Advertisement -

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు…12 మందికి తీవ్ర గాయాలు

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భానీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. సామర్లకోట మండలం జి.మేడపాడు సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది.గాయపడిన వారిని స్థానికులు హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.ఫ్యాక్టరీలో పనిచేసే వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పేలుడుకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -