టెలికం మార్కెట్లోకి జియోప్రవేశించడంతో పూర్తి స్వరూపమే మారిపోయింది. ఇప్పటికె రిలయన్స్ జియోతో పోటీ పడలేక సతమత మవుతున్నాయి. తాజాగా రిలయన్స్ జియోకు మరింత పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినియోగ దారులకు మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
ప్రస్తుతం రూ.349 ప్లాన్‌పై మరింత డేటా అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్‌పై ప్రస్తుతం 1జీబీ డేటా అందిస్తుండగా… ఇక నుంచి రోజుకు 1.5జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీలో ఎలాంటి మార్పు లేదు. 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది.
రూ.349 ప్లాన్‌పై ఈ మరింత డేటా అందించడంతో పాటు రూ.448తో మరో కొత్త ప్లాన్‌ను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద 70 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 70జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతేకాక ఈ ప్లాన్‌పై అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్‌పై ఉచితంగా అవుట్గోయింగ్ కాల్స్, 3000 ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. మై ఎయిర్టెల్ యాప్ ద్వారా ఈ ప్లాన్లను అందుబాటులో ఉంచింది.
