- Advertisement -

షాకింగ్‌..విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అతని తోటి విద్యార్థులే అమానుషంగా కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా వడ్లమూడి ప్రాంతంలోని విజ్ఞాన్ కాలేజీకి చెందిన విద్యార్థుల మధ్య ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు విద్యార్థులు బాధితుడిని కాళ్లతో తన్నుతూ, ఇనుప రాడ్లతో బలంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాడి సమయంలో అక్కడున్న మరికొందరు విద్యార్థులు అడ్డుకోవడం బదులుగా వీడియో చిత్రీకరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన విద్యాసంస్థల్లో భద్రత, క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.ఘటనకు కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -