Saturday, April 27, 2024
- Advertisement -

జ‌గ‌న్ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోవాల‌నె బాబు మాట‌ల్లో లాజిక్ మిస్స‌యిన‌ట్లుంది..

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని తెగ ఉబ‌లాట‌ప‌డుతున్నారు చంద్ర‌బాబుగారు. గ‌త మూడు సంవ‌త్స‌రాలు ఇదే మాట చెబుతూ క‌ల‌ల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా మ‌రో సారి జ‌గ‌న్ అక్ర‌మాస్తుల స్వాధీనం మ‌రోసారి తెల‌ర‌పైకి తెచ్చారు బాబుగారు. పాపం ఆయ‌న క‌ల నెర‌వేర‌లేద‌ని తెగ బాధ‌ప‌డిపోతున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకేముంది అసెంబ్లీలో ఆడిందె ఆట పాడిందె పాట‌గా మారింది. ఎలాగూ ప్ర‌తిప‌క్షం లేదుకాబ‌ట్టి చంద్రబాబు నుండి మంత్రులు, ఎంఎల్ఏలు జగన్ పై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, జగన్ అవినీతి గురించి విదేశాల్లో ఇప్పటికీ ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

ఇక్క‌డే 40 సంత్సారాల అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొనె బాబుగారు లాజిక్ మిస్స‌యిన‌ట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఒక్క కేసులో కూడా జగన్ అవినీతి నిరూపితం కాలేదు. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగా మరోవైపు చంద్రబాబు ఎలా జగన్ ను అవినీతిపరుడని ముద్రవేస్తారు? ఇదంతా జ‌గ‌న్‌ను ప్ర‌జ‌ల‌ల్లో చుల‌క‌న చేయ‌డానిక‌నె విష‌యం అంద‌రికి తెలుసు.

ఇదంతా బాగానె ఉంది త‌మ పార్టీలోఉన్న అవినీతి ప‌రులుగురించి మాత్రం నోరుమెద‌ప‌రు. గుర‌దింద‌లాగా నీతులు మాత్రం చెబుతారు .జగన్ పై కోర్టులో కేసులున్నట్లే, టిడిపికి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంఎల్సీలు వాకాటి నారాయణరెడ్డి, శ్రీనివాస్ తదితరులపై బ్యాంకులను వందల కోట్లకు చీటింగ్ చేసారన్న కేసులు విచారణలో ఉన్నాయి. దానిమీద మాట్లాడ‌మంటె స్పందించ‌రు. ఎప్పుడు ఇత‌రుల మీద బుర‌ద‌జ‌ల్ల‌డం త‌ప్ప త‌మ పార్టీలో ఉన్న బుర‌ద‌నుమాత్రం క‌డుక్కోరు ఏమ‌న్నంటె అదొక్క‌టి అడ‌క్కు..

పెట్టుబ‌డుల విష‌యానికి వ‌స్తె రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాలంటె పారిశ్రామిక వేత్త‌లు భ‌య‌ప‌డుతున్నారంట‌. అస‌లు ఏరాష్ట్రంలో అవినీతి లేదు అయినా అక్క‌డ పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. విశాఖ‌లో గ‌తంలో జ‌రిపిన పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య‌స‌ద‌స్సులో రూ26 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయిన ఊద‌ర‌గొట్టారు. ఇవ‌న్నీ అబద్దాలే అనుకోవాలి. అస‌లు ఎన్ని పెట్టుబ‌డులు వ‌చ్చాయో బాబుకె క్లారిటీ లేన‌ట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -