Monday, May 6, 2024
- Advertisement -

బాబుపై కోపం.. మోడీతో వైరానికి దారితీస్తోందా?

- Advertisement -

ఎంకిపెల్లి సుబ్బి చావుకు వచ్చిదంటే ఇదే.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అక్రమాలను బయటపెట్టే క్రమంలో జగన్ కేంద్రంలోని బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా వెళ్లడం ఇప్పుడు బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది. బాబు అవినీతిని నిరూపించే క్రమంలో జగన్ దూకుడుకు బీజేపీ కల్లెం వేసినా ఆగకపోవడంతో ఇప్పుడు బీజేపీ కూడా ఏపీ సీఎంపై గుర్రుగా ఉంది.

చంద్రబాబు అవినీతి నిరూపించే విషయంలో జగన్ దూకుడు మొదటికే మోసం వస్తుందన్న చర్చ సాగుతోంది. ఈ విషయంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం జగన్ కు కష్టాలు కొని తెచ్చి పెడుతుందంటున్నారు. పీపీఏల రద్దు వ్యవహారంలో కేంద్రం వద్దంటున్నా జగన్ ముందుకెళ్లడం విచారణకి మొగ్గు చూపడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ విషయంలో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి పీపీఏ రద్దు నిర్ణయాన్ని తప్పు పట్టినా.. వద్దని చెప్పిన జగన్ మాత్రం వినడం లేదు. విచారణకి మొగ్గుచూపుతున్నారు.

తాజాగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీపీఏల సమీక్షకు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించడానికి రెడీఅయ్యింది. రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విద్యుత్ సంస్థలు డిస్కంలు ఎన్టీపీసీ, ఎన్ఈసీఐని కోరారు. అయితే జగన్ సమీక్షకు రావద్దని కేంద్ర విద్యత్ సంస్థలు నిర్ణయించడం సంచలనమైంది.

అయినా జగన్ దూకుడుగా ముందుకు వెళ్లడంతో ఈ వ్యవహారంలో కేంద్రం వర్సెస్ ఏపీ ప్రభుత్వం దూరం పెరుగుతోంది. జగన్ దూకుడుగా వెళ్లడానికి కేంద్రంలోని ఉన్నత అధికారులు, బిజెపి ప్రభుత్వం సహించడం లేదని సమాచారం. ఇది ఇలాగే సాగితే జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి., చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి బీజేపీతో సున్నం పెట్టుకుంటున్న జగన్ విషయంలో మోడీ ఎలా వ్యవహరిస్తాడన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -