Friday, May 3, 2024
- Advertisement -

100 రోజుల పాలనలో జగన్ కు జనం జేజేలు… ప్ర‌తిప‌క్షాల‌కు వణుకు

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అనే నేను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్నాన‌ని ప్ర‌జ‌ల సాక్షిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసి నేటికి వందరోజులు పూర్తి చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీనీ మట్టి కరిపించి 151సీట్లతో బంఫర్ మెజారిటీతో అధికారంలో వచ్చింది.అయితే ఈ వంద రోజులు సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌నకు జ‌నం జేజేలు ప‌లుకుతున్నారు.100 రోజుల పాల‌న‌కే జ‌నం ఇంత‌లా పుల‌కించి పోతుంటే.. ప్ర‌తిప‌క్షాల‌కు మాత్రం వ‌ణుకు పుడుతుంది.

సీఎంగా జగన్ వందరోజుల్లో తీసుకున్న సంచలన నిర్ణయాలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల కోసం న‌వ‌ర‌త్నాలు అంటూ ముందుకు వ‌చ్చాడు.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.. అధికారం క‌ట్ట‌బెట్టారు.ప‌రిపాల‌న ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతోనే సంచ‌ల‌నం దిశ‌గా అడుగులు వేశాడు.

మంత్రి వర్గంలో సామాజిక న్యాయం పాటించి ప్రజలచేత జేజేలు అందుకున్నారు.సీఎం ప‌ద‌వి చేప‌ట్టింది మొద‌లు స‌మీక్ష‌ల పేరుతో, న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేసే క్ర‌మంలో అలుపెర‌గ‌కుండా ముందుు సాగుతున్నారు. పాలనలో ముందుకు సాగుతున్న తరుణంలో ప‌ల్లేరు కాయ‌లుగా ప్ర‌తిప‌క్షాలు సూటిపోటి మాట‌ల‌తో గుండెల్లో గుణ‌పాలా మాదిరిగా గుచ్చుతున్నా సంక్షేమ‌మే ధ్యేయ‌మంటూ బాట‌సారిలా సాగిపోతున్నాడు.

పాచిపెంట మండలంలో గిరిజన యూనివర్సిటీ, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, పార్వతీపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. వీటితో పాటు శ్రీ‌కాకుళం కిడ్ని బాధితుల‌కు కిడ్ని రిసేర్చ్‌, డ‌యాల‌సిస్ సెంట‌ర్‌తో పాటు, 200 ప‌డ‌క‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆస్ప‌త్రిని మంజూరు చేశాడు. ఇక కిడ్ని బాధితుల‌కు నెల‌కు రూ.10వేల ఆర్థిక సహాయం చేయ‌డం, ఇక ఫించ‌న్ ప‌థ‌కాన్ని రూ.2250కు పెంచ‌డం చేశాడు.

మ‌ద్య‌పాన నిషేదం అమ‌లు దిశ‌గా బెల్ట్‌షాపుల‌ను ఎత్తేస్తూ చ‌ర్య‌లు తీసుకోగా, విడ‌త‌ల వారిగా మ‌ద్యం షాపుల‌ను ఎత్తేస్తూ చ‌ర్య‌లు తీసుకున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. 60ఏండ్ల రాష్ట్ర చ‌రిత్ర‌లో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని సహాసం చేసి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారు.

ఆశ వ‌ర్క‌ర్ల జీతాల‌ను అమాంతం రూ.10వేల‌కు పెంపు,పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని భూకుంభకోణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్టోబర్‌ 15న రైతు కుటుంబానికి రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించారు.నవంబర్‌ 21న ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు రూ.10 వేలు, మత్స్యకారులకు ప్రస్తుతం రూ.6 ఉన్న డీజిల్ సబ్సిడీని రూ.9కి పెంచారు.

డిసెంబర్లో.. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం,జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అమ్మఒడి పథకం ప్రారంభం,షాపులున్న టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేలు అందజేస్తామని జగన్ ప్రకటించారు.అర్చకులకు వేతనాలను పెంచడంతోపాటు.. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజిమ్‌లకు రూ.5000, పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం. దాంతో పాటు ఉగాది నాడు పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామన్నారు.

శ్రీరామనవమి సందర్భంగా వైఎస్ఆర్ పెళ్లికానుక అందజేస్తామని సీఎం ప్రకటించారు.ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు పెళ్లి కానుకగా రూ. లక్ష,ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 1.25 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీలు కులాంతర వివాహం రూ.75 వేలు, వికలాంగులకు రూ.1.50 లక్షలు పెళ్లికానుకగా అందివ్వనున్నారు.

ఇలా జ‌గ‌న్ 100 రోజుల పాల‌న సాగిస్తుంటే ప్ర‌జ‌ల జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. జ‌గ‌న్‌కు కేవ‌లం ప్ర‌జ‌లే బ్ర‌హ్మ‌ర‌థం పడుతూ, జేజేలు కొట్ట‌డం లేదు.. ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను శభాష్ అంటున్నారు.జేజేలతో పాటు విమర్శలనకు కూడా మూటగట్టకున్నారు. ప్రధానంగా అన్నాక్యాంటీన్ ను మూసి వేయడం, ఇసుక కొరత,పోలవరం ప్రాజెక్టులపై విమర్శలు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -