- Advertisement -
వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్ర రెడ్డి అక్రమ అరెస్టుపై హైకోర్టు సీరియస్ అయింది. సవీంద్ర రెడ్డి కేసులో హైకోర్టు ముందు అడ్డంగా దొరికిపోయారు తాడేపల్లి పోలీసులు.
సవీంద్ర రెడ్డిని సాయంత్రం 7 గంటలకు అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో రాసిన తాడేపల్లి పోలీసులు కానీ తనను సాయంత్రం 4.30 గంటలకు అరెస్టు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ను కోర్టుకి సమర్పించారు సవీంద్ర రెడ్డి.
పోలీసులు అరెస్ట్ చేసిన తీరు, రాసిన రిపోర్ట్ పై అనుమానం వ్యక్తం చేసింది హైకోర్టు. ఎల్లుండి లోపు పూర్తి వివరాలు ఇవ్వాలని ..సవీంద్ర రెడ్డిని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు కేసులు.. అక్రమ అరెస్ట్ లకి కాలం చెల్లింది అని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
