Sunday, May 5, 2024
- Advertisement -

యాపిల్ వెబ్‌సైట్ల‌లో ఆమ్మ‌కానికి ఉంచిన నోట్‌బుక్‌లు

- Advertisement -
Apple new notebook

ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్‌లు,పీసీల‌లో దిగ్గ‌జం అయిన యాపిల్ కంపెనీ ఇప్పుడు కొత్త నోట్‌బుక్‌ల‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. అత్యంత నాజూకైన మ్యాక్‌బుక్‌లను యాపిల్‌ సంస్థ విడుదల చేసింది.

గతేడాది మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మ్యాక్‌బుక్‌, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌, మ్యాక్‌బుక్‌ ప్రోలకు కొత్త వెర్షన్లను రూపొందించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీటిని అమెరికాలోని శాన్‌జోస్‌ నగరంలో జరుగుతున్న ‘డబ్ల్యూడబ్ల్యూడీసీ 2017’ సదస్సులో ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ సోమవారం రాత్రి ఆవిష్కరించారు.
విప్ప‌టి వ‌ర‌కు మ్యాక్‌బుక్‌ ప్రో 15 అంగుళాల వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉండగా.. కొత్తగా మెరుగైన ఫీచర్లతో కూడిన 13 అంగుళాల వెర్షన్‌ను యాపిల్‌ విడుదల చేసింది. తాజా మ్యాక్‌బుక్‌లన్నింటిలోనూ గతం కంటే రెట్టింపు మెమొరీని సపోర్ట్‌ చేసే ఇంటెల్‌ ప్రాసెసర్‌ను అమర్చినట్లు తెలిపింది. 13.1మిల్లీమీటర్ల మందం గల ఈ నోట్‌బుక్‌లు తమ మ్యాక్‌బుక్‌లలో అంత్యంత పలుచనివని యాపిల్‌ పేర్కొంది.

{loadmodule mod_custom,GA2}

కొత్తగా తీసుకొచ్చిన 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్‌ ధర అమెరికాలో 1299డాలర్లు(సుమారు రూ.83,580)గా ఉంది. ఒక్కసారి బ్యాటరీని నింపితే ఛార్జింగ్‌ 10గంటల వరకు వస్తుందని యాపిల్‌ తెలిపింది.యాపిల్‌ వెబ్‌సైట్‌లో సోమవారం నుంచే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. యాపిల్‌ స్టోర్లలో బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -