Sunday, May 5, 2024
- Advertisement -

ఒన్ డే సిఎం కుర్చీ…… బాలయ్య వెయ్యి కోట్ల రూపాయల స్కాంకి తెరతీశాడా?

- Advertisement -

ఎన్టీఆర్ వారసుడిగా ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకుని, ఆ తర్వాత ఎన్టీఆర్‌లాగే సిఎం కుర్చీ ఎక్కేస్తాడని ఎప్పటి నుంచో బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. అయితే బాలయ్య మాత్రం బావచాటుగా ఉండిపోతూ ఎమ్మెల్యే పదవితో సర్దుకుపోతున్నాడు. అయితే తన సిఎం కుర్చీ ఎక్కే మురిపెం తీర్చుకోవాలనుకున్నాడో ఏమో కానీ చంద్రబాబు లేని టైం చూసి ఏకంగా సిఎం కుర్చీలో కూర్చుని సమీక్ష చేసి పడేశాడు. పచ్చ మీడియాతో సహా అన్ని మీడియా సంస్థల్లోనూ బాలయ్య సిఎం కుర్చీలో కూర్చోవడంపై ఆక్షేఫణలు వినిపించాయి.

ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ఒక్క రోజు సిఎం కుర్చీలో కూర్చున్న బాలయ్య వెయ్యి కోట్ల స్కాంకి పాల్పడ్డాడన్న ఆరోపణలు షాక్‌కి గురి చేస్తున్నాయి. ఒక్క రోజు సిఎం కుర్చీలో కూర్చున్నందుకే వెయ్యి కోట్ల స్కాంకి పాల్పడ్డ బాలయ్య అంటో నెట్‌లో కామెంట్స్ హోరెత్తుతున్నాయి. సీనియర్ జర్నలిస్టులు కూడా బాలయ్య స్కాం గురించి చర్చిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా వైకాపా కూడా బాలయ్య స్కాం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. సమీక్ష సందర్భంగా అనంతపురంలో జిల్లాలోని రెండు ఎత్తిపోతల పథకాలకు హడావిడిగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేత జీవోలు విడుదల చేయించాడట బాలయ్య. ఆ హడావిడి జీవోల ద్వారా వెయ్యి కోట్ల దోపిడీకి వ్యూహం పన్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ దోపిడీ కోసమే జీవో నంబర్ 59, 60 లను హడావిడిగా విడుదల చేశారని చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక్క రోజు సిఎం కుర్చీలో కూర్చున్నందుకే వెయ్యి కోట్ల స్థాయి స్కాం ఆరోపణలకు తెరతీసిన బాలయ్య అక్కడ కూడా తన స్టార్ హోదాను చూపించాడని చెప్పాలేమో. మామూలు వాళ్ళకు సాధ్యమయ్యే పనేనా అది? ఇంతకూ ఈ విషయంపై చినబాబు, పెదబాబు స్పందనలేంటో? అంతా మా కుటుంబ వ్యవహారం అన్న ప్రకటనలు ఏమైనా వదుల్తారేమో చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవహారాలన్నీ కూడా నారావారి కుటుంబ వ్యవహారాల్లా మారిపోయాయిగా మరి. ఆ విషయాన్ని మేధావులు ఎంతగా విమర్శిస్తున్నా మార్పు మాత్రం కొంచెం కూడా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -